🔥 TRENDING AIMIM leader Akhtarul Iman’s controver... Religious Leaders Dismiss Congress MP'... पोलिस भरतीदरम्यान मासिक पाळी आल्यास दु... అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న... Rajpal Yadav: From Ordnance Factory Ap... Amit Shah Plants Red Sandalwood Tree i...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 22 Nov 2026, 08:38 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లతోనే నేను ఎమ్మెల్యే అయ్యా – అనిల్ జాదవ్

గ్రామానికొక అంబేద్కర్‌లా తయారవ్వాలి.. ఆయన ఆశయాల సాధనకు అందరం కృషి చేయాలి
ఇచ్చోడ మండలంలోని దాభా (కే) గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లు, ప్రాథమిక ఓటు హక్కు వల్లే తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి గ్రామం నుంచి ఒక అంబేద్కర్‌లా ఎదిగే వ్యక్తి తయారవ్వాలని ఆకాంక్షించారు. దేశంలోని అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించాలనే సంకల్పంతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించారని గుర్తుచేశారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా దాభా (కే) గ్రామస్తులు ఎస్సీ కేటగిరీలో ఏర్పాటు చేసిన రోస్టర్ విధానంపై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కేటగిరీ 1, 2లో మహార్, మాల సామాజిక వర్గాలకు రిజర్వేషన్ల పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ఈ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించి, రోస్టర్ విధానంపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ అంశంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
📲Get App