మహిళలు, విద్యార్థినుల భద్రతే లక్ష్యం: షీ టీం
ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్లో మంగళవారం షీటీమ్, భరోసా కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్ప్ లైన్, సైబర్ భద్రత, చట్టాలపై వివరించారు. మహిళలు, విద్యార్థినుల భద్రతకు పోలీసుశాఖ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. వేధింపులు ఎదురైతే భయపడకుండా వెంటనే షీటీమ్ను సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.