🔥 TRENDING ಬಸವಣ್ಣನವರ ಕುರಿತು ಅವಹೇಳನಕಾರಿ ಹೇಳಿಕೆ - ರ... ఇచ్చోడ:రూ.7 కోట్లతో విద్యా సంస్థల అభివ... અમરેલી સિવિલ હોસ્પિટલમાં બાપા સીતારામ... साप्ताहिक समीक्षा बैठक में जिला कलेक्ट... வேலூர் புதிய பேருந்து நிலையத்தில் போக்... Punjab Congress lifts suspension of fo...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఇచ్చోడ:రూ.7 కోట్లతో విద్యా సంస్థల అభివృద్ధికి శ్రీకారం

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 23 Nov 2026, 03:20 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
డిగ్రీ కళాశాలను పీజీ కళాశాలగా మారుస్తాం: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఇచ్చోడ మండల కేంద్రంలో రూ.2 కోట్లతో డిగ్రీ కళాశాల, రూ.5 కోట్లతో ZPSS పాఠశాల నూతన భవనాల నిర్మాణానికి కేటాయించిన స్థలాలను సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ కళాశాలను పీజీ కళాశాలగా అభివృద్ధి చేస్తామని, ZPSS పాఠశాలను అన్ని సౌకర్యాలతో నిర్మిస్తామని తెలిపారు. తాను చదువుకున్న పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, విద్యాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
📲Get App