🔥 TRENDING ડેડાડ ગામના રામજી મંદિર પટેલ પરા વિસ્ત... ਪੋਲਟਰੀ ਸੰਕਟ: 6 ਦਿਨਾਂ ''ਚ ਕਰੀਬ 50,000 ਮ... Meghalaya CM surveys setup for Israel... Pakistan's ISI adopts multi-camp strat... RBI proposes stricter verification for... Tripura CM Manik Saha Announces 58 New...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జీకే వీధిలో వైఎస్సార్సీపీ హవా.. 18 ఎంపీటీసీలకు 14 స్థానాల్లో విజయం

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 07 Nov 2026, 07:42 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా,గూడెంకొత్తవీధి మండలంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 18 స్థానాలకు గాను 14 స్థానాలను కైవసం చేసుకుంది. జనసేన రెండు స్థానాల్లో, టీడీపీ ఒక స్థానంలో, టీడీపీ రెబల్ ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు.
వైఎస్సార్సీపీ తరఫున జీకే వీధి 1లో పూజారి లీలప్రసాద్, జీకే వీధి 2లో వంతల జగత్, జీకే వీధి 3లో బొబ్బిలి లక్ష్మణ్, మొండిగడ్డలో జర్త బాలన్న, జర్రెలలో రాజమణి, దామనపల్లిలో సాగిన సత్యవతి, రింతాడ 2లో పలాస చిన్నారావు, గుమ్మిరేవులలో అప్పారావు, గాలికొండలో జ్యోతిరాణి, సీలేరులో సత్ ప్రియా, ధారకొండలో బాకూరు రాజేశ్వరి, దుప్పలవాడలో వెలుగురి సత్యనారాయణ, లకవరపుపేటలో ప్రేమకుమారి, దేవరపల్లిలో వరలక్ష్మి విజయం సాధించారు.జనసేన తరఫున వంచులలో సూర్యనారాయణ, రింతాడ 1లో గెమ్మెల పాల్సు గెలుపొందగా, టీడీపీ తరఫున సంకాడలో మామిడి సుభద్ర విజయం సాధించారు. పెడవలసలో టీడీపీ రెబల్ అభ్యర్థి గబులంగి విజయలక్ష్మి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు.
ఎన్నికల ఫలితాలతో మండలంలో రాజకీయ పార్టీల బలాబలాలు వెల్లడయ్యాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థులు సాధించిన విజయంపై ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
📲Get App