🔥 ट्रेंडिंग ଓଡ଼ିଶା ଆସିବେନି ଅମିତ ଶାହ, ବାତିଲ ହେଲା ପୁ... ଭୁବନେଶ୍ୱରରେ CBIର ବଡ଼ ଆକ୍ସନ୍: ୩ ଲକ୍ଷ ଟଙ... କାର୍ତ୍ତିକ ପୂର୍ଣ୍ଣିମାରେ ଶୁଭୁଛି ଆ ..କା…ମ... Bihar ଆଜିଠାରୁ ଆରମ୍ଭ ହେବ ଐତିହାସିକ ବାଲିଯାତ୍ରା,... ಗೌರಿ ಹುಣ್ಣಿಮೆಯಂದು ಮಾರಿಕೊಪ್ಪದ ಶ್ರೀ ಹಳದಮ...
24 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

బావుసాయిపేట గ్రామ ఉపసర్పంచ్ తిక్కల నవీన్ పై మహిళా సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా ఫిర్యాదు

✍️ रिपोर्टर: Pothula Gandhi Babu 🗓 24 नव. 2026, 02:24 PM 👁 33
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

బావుసాయిపేట గ్రామ ఉపసర్పంచ్ తిక్కల నవీన్ పై మహిళా సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా సోమవారం ఫిర్యాదు చేశారు, వీడియో తీస్తూ తిడుతూ, భర్తను దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపించారు.

బావుసాయిపేట గ్రామ ఉపసర్పంచ్ తిక్కల నవీన్ పై మహిళా సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా సోమవారం కోనరావుపేట మండల మహిళా సర్పంచులతో, కాంగ్రెస్ పార్టీ కోనరావుపేట మండలం అధ్యక్షుడు మానుక సత్తయ్య, ఫ్యాక్స్ చైర్మన్ గంగాధర్లతో కలిసి ఎస్ హెచ్ ఓ రామ్మోహన్ కు ఫిర్యాదు చేశారు.

గ్రామంలో గ్రామ పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి దసరా పండుగకు సంబంధించిన ఖర్చులు, ఇతర గ్రామ మూలిక వసతులు చర్చిస్తున్న సమయంలో, భవిష్యపేట గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ తిక్కల నవీన్ ఉద్దేశపూర్వకంగా మహిళా సర్పంచి నైనను తన సెల్ ఫోన్ లో వీడియోలు తీస్తూ తిడుతున్నట్లు ఆరోపించారు. ఆమె భర్త అక్కడికి వచ్చి సరైన పద్ధతి కాదని ఉపసర్పంచ్ నవీన్ తో చెప్పగా, అతను ఇష్టం వచ్చిన బూతులు తిట్టి దురుసుగా ప్రవర్తించాడు.

మహిళా సర్పంచ్ నైనా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపసర్పంచ్ నవీన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిర్యాదు ఇచ్చారు. ఇందులో సర్పంచ్ లు ఆమని, లక్ష్మి, స్వప్న, గౌతమి, చైతన్య సర్పంచ్ లు ఉన్నారు.
📲Get App