🔥 TRENDING ಬ್ರಿಮ್ಸ್ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಔಷಧ ಕೊರತೆ: ಒಂದು... India and New Zealand End Hockey Match... Panchayat Season 5 Trailer to Debut To... Film 'King' to Debut on 24 December; T... UP Man Attempts Scheme Marriage, Wife... India Today Teases Upcoming In‑Depth N...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జీకే వీధి పంచాయతీకి సేవ చేయడమే నా సంకల్పం అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తా: దొండ కొండమ్మ

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 22 Nov 2026, 09:10 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
జీకే వీధి పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న దొండ కొండమ్మ ప్రజల మద్దతు కోరుతూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పంచాయతీ పరిధిలోని గ్రామాల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.సర్పంచ్‌గా ఎన్నికైతే గ్రామాల మధ్య ఎలాంటి వివక్ష లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అవసరాలను తెలుసుకుని సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు.ఈ నెల 26న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌లో ఐదో స్థానంలో ఉన్న వంకాయ గుర్తును గుర్తించి ఓటు వేసి తనకు మద్దతు ఇవ్వాలని దొండ కొండమ్మ ఓటర్లను అభ్యర్థించారు.
📲Get App