🔥 TRENDING Danish Pandor Highlights Goa’s Charm f... Telangana Releases 2027 Inter Exam Tim... Cyclone Akvan Weakens Before Making La... Cyclone Akvan Update: 8 AM Bulletin Hi... Severe Cyclonic Storm Akwan Approaches... Cyclone Akvan lashes Andhra-Odisha coa...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

నూతన తరగతి గదులను ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 20 Nov 2026, 11:43 AM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
నేరడిగొండ: మండల కేంద్రంలోని శిశు మందిర్ పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించడం ఎంతో ముఖ్యమని, విద్యారంగ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. నూతన తరగతి గదులు విద్యార్థుల చదువుకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
📲Get App