🔥 TRENDING छठ पूजा का पहला दिन: श्रद्धा और उपासना... वीर शहीद मेजर शेतान सिंह भाटी ಪರಿಶಿಷ್ಟ ಜಾತಿ ಮತ್ತು ಪರಿಶಿಷ್ಟ ಪಂಗಡದವರ ಮ... Fresh Snowfall Halts Traffic on Lahaul... Christmas cake mixing kicks off holida... Uttarakhand's Kashi Pur and Rudrapur S...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ గిత్తే గజానంద్ సభ్యత్వం రద్దు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 13 Nov 2026, 12:55 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవు: తిరుమల్ గౌడ్
గుడిహత్నూర్: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో గుడిహత్నూర్ మండలానికి చెందిన నాయకుడు గిత్తే గజానంద్ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ తన వైఖరిలో మార్పు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జోగు రామన్న ఆదేశాల మేరకు, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచనలతో సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల్ గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, పార్టీ సిద్ధాంతాలు, నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
పార్టీకి వ్యక్తుల కంటే సిద్ధాంతాలు, క్రమశిక్షణ, ఐక్యతే ముఖ్యమని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం ఉంటుందని, క్రమశిక్షణ ఉల్లంఘించే వారిపై భవిష్యత్తులోనూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
📲Get App