🔥 TRENDING ग्राम बगड़ राजपूत में भगवान भोलेनाथ के... वारिसलीगंज के हैवतपुर में पुलिस ने गां... కడుపునొప్పి బాధ భరించలేక కర్నూలు జిల్ల... વિક્રમ સંવત ૨૦૮૩ ના પ્રારંભે અમદાવાદમા... Rajinikanth Confirms Upcoming Multi-St... Bhai Dooj 2026: Celebrity-Inspired Fes...
10 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సీలేరు అభివృద్ధి ప్రాజెక్టుకు అందరూ సహకరించాలి నిర్వాసితులతో సబ్‌ కలెక్టర్ సమావేశం.. పీహెచ్‌సీలో ఎక్స్‌రే, స్కానింగ్ యంత్రాల ఏర్పాటుకు హామీ

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 10 Nov 2026, 07:03 PM 👁 25
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సీలేరు ఏపీ జెన్‌కో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్మాణ పనులు నిరాటంకంగా కొనసాగేందుకు నిర్వాసితులు సహకరించాలని సబ్‌ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. గూడెంకొత్తవీధి మండల పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రాజెక్టు నిర్మాణం ప్రాంత అభివృద్ధికి దోహదపడేలా ఉంటుందని, పనుల నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా మేఘా కంపెనీకి సహకరించాలని కోరారు. నిర్మాణ పనులు సకాలంలో పూర్తయ్యేలా అధికారులు, నిర్వాసితులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.అనంతరం సీలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడి వైద్య సదుపాయాలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు త్వరలోనే ఆసుపత్రిలో ఎక్స్‌రే, స్కానింగ్ యంత్రాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ హెచ్. అన్నాజీ రావు, సంబంధిత అధికారులు, ప్రాజెక్టు నిర్వాసితులు పాల్గొన్నారు.
📲Get App