బెలుగుప్పలో ఘనంగా వాల్మీకి జయంతి ఉత్సవాలు
మండల కేంద్రమైన బెలుగుప్పలు మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వాల్మీకి నాయకులు తిప్పయ్య మల్లికార్జున ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి వేదికలు వివిధ పుష్పాల పూలహారాలతో అలంకరించారు అనంతరం వాల్మీకి మహర్షికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వాల్మీకి నాయకులు పాల్గొన్నారు.