🔥 TRENDING West Bengal's New Investment Policy Pu... INDIA Bloc Calls for Disqualification... Bihar Government Reassigns Five IPS Of... Prashant Kishor ridicules Bihar CM's "... સુરત જિલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદી... સુરતના પલસાણા તાલુકાના વરેલી ગામની એશ્...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

🔥 *సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ ఫ్లాప్ చేశారు! ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే! 🔥*

✍️ Reporter: BOYA RAJU 🗓 26 Oct 2026, 02:50 PM 👁 70
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🪭 *కూటమి హామీలపై ఎర్రకోట రాజీవ్ రెడ్డి ధ్వజం.. -----డాక్టర్ రఘు గారికి మరో అవకాశం ఇవ్వాలని

ఎమ్మిగనూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో 11వ, 12వ, 13వ వార్డుల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజల మద్దతు కోరారు.

🪭 11వ వార్డు: అభ్యర్థి హసీనా బాను గారి తరఫున ఇంచార్జ్ మెకానిక్ సాదిక్ గారి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.

🪭 12వ వార్డు: అభ్యర్థి అబ్దుల్లా గారి తరఫున ప్రచారం నిర్వహించి ప్రజల మద్దతు కోరారు.

🪭 13వ వార్డు: అభ్యర్థి కె. భారతి గారు, బీరప్ప గారి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజల ఆశీర్వాదాన్ని కోరారు.

🔥 *రాజీవ్ రెడ్డి గారి ధ్వజం..------కూటమి హామీలు ఎక్కడ?*

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.

“సూపర్ సిక్స్ అన్నారు.. కానీ ప్రజలకు కనిపిస్తున్నది సూపర్ ఫ్లాప్ పాలన!” అంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన పాలకులు, వాటిని అమలు చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు.

*పెరిగిన నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలతో సామాన్యుడి బతుకు భారంగా మారిందని, కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టంగా మారుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్‌ఈసీ సభ్యులు శ్రీ బనవాసి బసి రెడ్డి గారు పేర్కొన్నారు. ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించి, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.*

*“హామీలు నెరవేర్చాకే ఓటు అడగండి.. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పండి!” అంటూ నాయకులు ప్రజల పక్షాన గళమెత్తారు.*

🔥 *అనుభవానికి మరో అవకాశం.. ఎమ్మిగనూరు అభివృద్ధికి డాక్టర్ కె. ఎస్. రఘు!*

ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ కె. ఎస్. రఘు గారు మాట్లాడుతూ, గతంలో మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం తనకు ఉందని తెలిపారు. ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రతి వార్డు పురోగతి సాధించాలని, ప్రతి ప్రాంతంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడాలని, ప్రజల సమస్యలకు పరిష్కారం లభించాలని ఆకాంక్షించారు.

“ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రతి వార్డును అభివృద్ధి పథంలో నడిపించేందుకు నాకు మరో అవకాశం ఇవ్వండి. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తాను” అని ప్రజలను కోరారు.

🪭 *ఫ్యాన్ గుర్తు కు ఓటు వేద్దాం --- డాక్టర్ కె. ఎస్. రఘు గారిని గెలిపిద్దాం!*

వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు, రాష్ట్ర ఎస్‌ఈసీ సభ్యులు బనవాసి బసి రెడ్డి గారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఎమ్మిగనూరు పట్టణ అభివృద్ధి కోసం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని కోరారు.

🔥 సూపర్ సిక్స్ కాదు.. ప్రజలకు కావాల్సింది హామీల అమలు!
💥 మాటలు కాదు.. చేతల్లో అభివృద్ధి చూపించాలి!
🪭 మన ఓటు – ఫ్యాను గుర్తుకు!
💪 మన ఎమ్మిగనూరు అభివృద్ధి కోసం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపిద్దాం!
📲Get App