ఆదిలాబాద్ కాంగ్రెస్కు షాక్.. బీఆర్ఎస్లోకి భార్గవ్ దేశ్పాండే
కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు
ఆదిలాబాద్: జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు భార్గవ్ దేశ్పాండే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి జాన్సన్ నాయక్, సీనియర్ నాయకుడు తలసాని సాయికిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.