ఆదిలాబాద్: ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలు ఆదిలాబాద్ జెడ్పీ సమావేశ మందిరంలో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఈ మేరకు రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును కలెక్టర్ వినియోగించుకున్నారు. భవిష్యత్తులో రెడ్క్రాస్ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి పలు అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.