🔥 ट्रेंडिंग समस्तीपुर, बिहार में कक्षा 10 की लड़की... नेरज पांडे ने जामुई घटना के बाद बीजेजे... बिहार की सड़क पर लड़की को छेड़ने वाले... दिल्ली के मुखर्जी नगर में सफारी कार वा... समस्तीपुर के जगतसिंहपुर में वीडियो वाय... छत्तीसगढ़ के रायपुर में आग लगने की वीड...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మండల సమస్యలపై సిరికొండ నాయకుల సన్మానం

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 24 सित. 2026, 12:32 PM 👁 23
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సిరికొండ: మండల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ భోజ్జు పటేల్‌ను సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసి ఘనంగా సన్మానించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సిరికొండ మండలంలోని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసేందుకు అటవీశాఖ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడం, ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి ఆటంకాలు ఎదురవుతున్న అంశాలను ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ అసెంబ్లీలో ప్రస్తావించారు. సమస్యలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లి, ఆదివాసీ గ్రామాల అభివృద్ధి పనులు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన సిరికొండ మండల కాంగ్రెస్ నాయకులు, ఆయనను శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కంచం లక్ష్మణ్, రిమ్మ గ్రామ సర్పంచ్ పెందూర్ జంగుబాయి, బండు పటేల్, మాజీ జడ్పీటీసీ కుంరం చంద్రకళ, రఘూరామ్, మాజీ అధ్యక్షుడు షేక్ ఇమామ్, మాజీ సర్పంచ్ పెందూర్ అనిల్, రాజ్ గోండ్ సేవా సమితి అధ్యక్షుడు యాదవ్ రావు, సామాజిక కార్యకర్త షేక్ అలాం, మెస్రం విశ్వనాథ్, రాథోడ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
📲Get App