🔥 TRENDING Breaking News ; ''ਅਗਨੀਵੀਰਾਂ'' ਲਈ ਕੇਂਦਰ... Assured Minimum Facilities Reviewed in... विधायक अनिल सिंह ने कंचनपुर में कार्यक... खाकी पर लगा दाग! तस्करी मामले में दो य... MLA sonawari adv Hilal akbar Lone met... ਪੰਜਾਬ ''ਚ ਨੈਸ਼ਨਲ ਹਾਈਵੇਅ ਜਾਮ! ਗੱਡੀਆਂ ਦੀਆ...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

హైదరాబాద్ శివార్లలో నకిలీ 500 రూపాయల నోట్లను ముద్రిస్తున్న ముఠా అరెస్ట్

✍️ Reporter: Kranthi Kumar 🗓 04 Nov 2026, 02:45 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
హైదరాబాద్ శివార్లలోని హయాత్ నగర్ మండలం కుంట్లూరు లో అద్దె ఇంట్లో నకిలీ 500 రూపాయల నోట్లను ముద్రిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి భారీ మొత్తంలో నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా అద్దె ఇంట్లోనే నకిలీ కరెన్సీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ​ఈ కేసులో నలుగురు నిందితులను (మడుపోజు కరుణాకర్, చిన్నోళ్ల మాణిక్య రెడ్డి, చెరుకుపెల్లి రత్నాకర్ రెడ్డి, కరణం అజయ్ కుమార్) పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. దాదాపు రూ.6.78 కోట్ల విలువైన నకిలీ రూ.500 నోట్లతో పాటు కలర్ ప్రింటర్లు, స్కానర్లు, పేపర్ కటింగ్ మెషిన్, ల్యాప్‌టాప్, లామినేషన్ మెషిన్‌లను పోలీసులు సీజ్ చేశారు. కేవలం నోట్ల ముద్రణే కాకుండా, తక్కువ ధరకు నకిలీ కరెన్సీ ఇస్తామంటూ అమాయకులను రప్పించి, తాము పోలీసులమని నకిలీ ఐడీ కార్డులు, వాకీ-టాకీలతో బెదిరించి వారి వద్ద ఉన్న అసలు డబ్బును దోచుకునేవారు.
​అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, షాద్‌నగర్ SOT (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ ముఠా గుట్టు రట్టయింది.
📲Get App