🔥 TRENDING श्री सुजाननाथ जी महाराज की 780वां समा... ભરૂચ કલેક્ટર કચેરી ખાતે શિક્ષકો દ્વારા... ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత...... ಜೇಸಿಐ ಸುಳ್ಯ ಪಯಸ್ವಿನಿ ಘಟಕಕ್ಕೆ ಅರೋಹಣ ತರಬ... The Paradise Maintains Strong Box Offi... Ticket Booking App Removes Ratings for...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మూడు నెలల్లో 50 లక్షల తో రైతు బజారు నిర్మాణం పూర్తి... ఎమ్మెల్యే గౌతు శిరీష

✍️ Reporter: Dinesh Kumar Panda 🗓 28 Sep 2026, 12:44 PM 👁 17
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో రూ. 49.30 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న రైతు బజార్‌కు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ.. కేవలం మూడు నెలల కాలంలోనే రైతు బజార్ నిర్మాణం పూర్తి చేసి రైతులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు తాజా కూరగాయలు అందించడమే లక్ష్యంగా ఈ రైతు బజార్‌ను ఆధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

గత ప్రభుత్వం అభివృద్ధి విషయంలో కేవలం గాలి మాటలకే పరిమితమైందని ఆమె విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలాస-కాశీబుగ్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, టీడీపీ నాయకులు, రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు
📲Get App