26న మహర్షి వాల్మీకి జయంతి: ఆదిలాబాద్ కలెక్టర్
ఈ నెల 26న మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వాల్మీకి సామాజిక వర్గ ప్రజలు, బీసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు