రూ.2 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
నేరడిగొండ: మండలంలోని బోథ్ రోడ్డు నుంచి బుద్దికొండ వరకు తేజాపూర్ మీదుగా రూ.2 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు పనులను సోమవారం సాయంత్రం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. ఈ రహదారితో పలు గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. గ్రామాలకు రోడ్లు, విద్య, వైద్యం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.