🔥 TRENDING દારૂબંધીના દાવા વચ્ચે સિનાઈ ડાઈવેનો વા... J&K Court Criticises Police for FIR De... Actor Nana Patekar stays in modest 1BH... Nana Patekar lauded for infusing raw a... IIFA 2027 to be Hosted in Abu Dhabi, S... Actor Sivakarthikeyan Says He Will Sti...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

తణుకు మున్సిపల్ ఎన్నికలు: ఈసారి ఓటర్లకు 2 ఓట్లు - ఛైర్మన్ ఎన్నికపై ఆసక్తి

✍️ Reporter: Mantha Bhanuprakash 🗓 09 Oct 2026, 02:40 AM 👁 13
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

తణుకు మున్సిపల్ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈసారి ఛైర్మన్‌ను నేరుగా ఎన్నుకునే అవకాశం కల్పించడంతో ఓటర్లు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది.

తణుకు మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమం కావడంతో అధికారులు ఎన్నికల ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇప్పటివరకు వార్డు కౌన్సిలర్లను ఎన్నుకుని, వారి ద్వారా మున్సిపల్ ఛైర్మన్ను ఎన్నుకునే విధానం ఉండేది.

తాజాగా ప్రభుత్వం ఛైర్మన్ను నేరుగా ఎన్నుకునే అవకాశం కల్పించడంతో ఈసారి ఓటర్లు 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒక ఓటు వార్డు కౌన్సిలర్‌కు, మరో ఓటు నేరుగా ఛైర్మన్‌కు వేయాలి.

ఈ నేపథ్యంలో ఛైర్మన్ పదవికి ఎంతమంది అభ్యర్థులు బరిలో నిలుస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. నేరుగా ఛైర్మన్ ఎన్నిక జరగనుండటంతో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వ్యూహరచనలో నిమగ్నమయ్యారు.
📲Get App