త్వరలోనే రిమ్స్‌లో 150 పడకల నిర్మాణం: మంత్రి దామోదర్ రాజనర్సింహ
Watch on:
▶️ YouTube
ఆదిలాబాద్: రిమ్స్ ఆస్పత్రిలో మదర్ అండ్ చైల్డ్ హెల్త్ (ఎంసీహెచ్) సేవలను మరింత బలోపేతం చేసేందుకు 150 పడకల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.
థలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేకంగా హెమటాలజీ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అత్యవసర వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ఎమర్జెన్సీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
అదేవిధంగా రిమ్స్‌లో పీడియాట్రిక్స్, రేడియాలజీ, సైకియాట్రీ విభాగాల్లో పీజీ సీట్ల కేటాయింపునకు దరఖాస్తు చేసినట్లు మంత్రి తెలిపారు. ఆస్పత్రిలో వైద్య సేవలు, మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు