Local
హైదరాబాద్ ఉప్పల్ లో ₹3.22 కోట్లతో సిటీ బస్ టెర్మినల్
Watch on:
▶️ YouTube
హైదరాబాద్ లోని ఉప్పల్ జోనల్ వర్క్ షాప్ వద్ద ₹3.22 కోట్లతో సిటీ బస్ టెర్మినల్ నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. రోజుకు లక్ష మంది ప్రయాణికులకు సేవలు అందించేలా అత్యాధునిక హంగులతో టెర్మినల్ నిర్మిస్తామని, ఈ టెర్మినల్ పనులు 100 రోజుల్లో పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో MLA మల్లారెడ్డి, RTC ఎండీ నాగిరెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. శంకుస్థాపన అనంతరం బస్ లో ప్రయాణించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.