🔥 TRENDING ಬಿಜೆಪಿ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷ ಬಿ.ವೈ. ವಿಜಯೇಂದ್ರ:... गंगापुर सिटी और वजीरपुर मे ं बन े कांग... Gujarat ATS Seizes Radical Literature... North Gujarat MEMU Service Extended to... Gujarat's education loans plunge 29% i... BJP MP Tejasvi Surya Hails Opposition...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ప్రజాప్రతినిధులకు కొత్తవీధిలో ఘన స్వాగతం దింసా నృత్యాలతో హోరెత్తిన గ్రామం.. శాలువాలు, పూలమాలలతో ఘన సత్కారం

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 29 Nov 2026, 10:50 AM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని కొత్తవీధి గ్రామంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామ సర్పంచ్ అంపురంగి బుజ్జిబాబు, గొందిపల్లి ఉపసర్పంచ్ కొడబాల సతీష్, పూజారిపాకల వార్డు సభ్యుడు కొర్ర ప్రసన్నకుమార్, పాతవీధికి చెందిన నాడేల సత్తిబాబులను గ్రామస్తులు ఆత్మీయంగా ఆహ్వానించి శాలువాలు కప్పి సత్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ అంపురంగి బుజ్జిబాబు, ఆయన సతీమణికి పూలమాలలు వేసి ప్రత్యేకంగా సన్మానించారు. సంప్రదాయ దింసా నృత్యాలతో గ్రామస్తులు ఉత్సాహంగా స్వాగతం పలకడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని ప్రజాప్రతినిధులపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి:

ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేయాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.
📲Get App