🔥 TRENDING સાવરકુંડલા માં ૯૭- સાવરકુંડલા-લીલીયા વ... ठाणे के ब्रह्मांड में ट्रक क्षतिग्रस्त... Yeh Prem Mol Liya Sees 31.5% Surge on... Ayushmann Khurrana Leads List of 5 Bol... Ramayana Box Office Day 24: Film Nears... Maharashtra, West Bengal Clinch Grade...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 29 Nov 2026, 01:57 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
తలమడుగు మండలం కుచలాపూర్ గ్రామంలో నిర్వహించిన పోచమ్మ తల్లి వార్షికోత్సవం, సామూహిక బోనాల ఉత్సవాల్లో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలతో గ్రామం సుభిక్షంగా వర్ధిల్లాలని పోచమ్మ తల్లిని ప్రార్థించినట్లు తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
📲Get App