🔥 TRENDING રાજુલા તાલુકાના નવી બારપટોળી પાસે માધવ... बहराइच के विशेश्वरगंज में दो महिलाओं द... सूरौठ में अटल प्रगति पथ निर्माण पर अति... करौली में नालसा सुरक्षित बचपन अभियान क... फतेहगढ़ उप प्रधान पद के लिए आवेदन दर्ज बहराइच में विधानसभा स्तरीय रोजगार मेले...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

గిరిజన హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ముందుకు రావాలి గొందిపల్లిలో గ్రామస్తులతో సర్పంచ్ అంపురంగి బుజ్జిబాబు సమావేశం

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 28 Nov 2026, 12:54 PM 👁 24
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం గొందిపల్లి గ్రామంలో సర్పంచ్ అంపురంగి బుజ్జిబాబు గ్రామస్తులతో సమావేశమై స్థానిక సమస్యలు, గ్రామాభివృద్ధి అంశాలపై చర్చించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా గిరిజనుల హక్కులు, రిజర్వేషన్లు, ప్రత్యేక చట్టాల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. జీవో నంబర్‌-3 ప్రాధాన్యతను వివరిస్తూ గిరిజన హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ అవగాహనతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చదువుకున్న నిరుద్యోగ యువత సామాజిక పరిస్థితులపై అవగాహన పెంచుకుని గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.
అలాగే భారీ రహదారి ప్రాజెక్టుల నేపథ్యంలో గిరిజన ప్రాంతాల సామాజిక వనరులు, ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్, సీపీఎం కార్యకర్తలు, యువత, మహిళలు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
📲Get App