🔥 ट्रेंडिंग સાબરકાંઠા ઝોનમાં ત્રીજા સંતાન માટે રૂ.... दिल्ली में स्वास्थ्य सुविधाओं के विस्त... जुन्नागढ़ में महामंडलेश्वर गिरनर माता... ऑटो‑रिक्शा और टैक्सी चालकों ने अहमदाबा... वडोदरा क्राइम ब्रांच ने 10 गुजरात जिलो... *NEED24 NEWS*
25 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

టీడీపీకి బిగ్ షాక్.. ఎనకండ్లలో టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరికలు!*

✍️ रिपोर्टर: బోయ రాజు 🗓 25 नव. 2026, 03:35 PM 👁 37
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇంచార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఎనకండ్ల టీడీపీ నాయకులు.. సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి అఖండ మెజారిటీ సాధిస్తామని హామీ గోనెగండ్ల మండలం ఎనకండ్ల గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు ఆ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వి. రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేడు ఎమ్మిగనూరు పట్టణంలోని వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో ఎనకండ్ల గ్రామ టీడీపీ నాయకులు నాగవర్ధన్ రెడ్డి (పెద్ద సంజీవ రెడ్డి కుమారుడు), విష్ణు వర్ధన్ రెడ్డి (చిన్న సంజీవ రెడ్డి కుమారుడు), గజేంద్ర రెడ్డి, వీరేష్ రెడ్డి (శ్రీనివాస రెడ్డి కుమారుడు), భాస్కర్ రెడ్డి (వ్యాహనదా రెడ్డి కుమారుడు), పర్వత రెడ్డి (హనుమంత రెడ్డి కుమారుడు), రామాంజనేయులు (కే. సీతారాముడు కుమారుడు), లాల్ రెడ్డి (హనుమంత రెడ్డి కుమారుడు) తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంలో కార్యకర్తలకు సరైన గుర్తింపు, గౌరవం లభించడం లేదని, గ్రామ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే స్పందన ఆశించిన స్థాయిలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను కేవలం ఓటర్లుగా మాత్రమే చూస్తున్నారని, ప్రజా సమస్యలు మరియు గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నాయకత్వం పట్ల నమ్మకంతో పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు అదే సమయంలో రాబోయే స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అఖండ మెజారిటీ సాధించి విజయాన్ని అందిస్తామని, పార్టీ బలోపేతానికి ఐక్యంగా కృషి చేస్తామని ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారికి, పార్టీ నాయకులకు స్పష్టంగా తెలియజేశారు. ఎనకండ్ల గ్రామంలో వైఎస్సార్‌సీపీ విజయానికి తమ వంతు కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎనకండ్ల గ్రామ వైఎస్సార్‌సీపీ నాయకులు వీరా రెడ్డి గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎనకండ్లలో టీడీపీకి ఎదురుదెబ్బ.. వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కొత్త చేరికలు.. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో అఖండ విజయం లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ శ్రేణుల ముందడుగు!
📲Get App