🔥 TRENDING Ward Boy Caught on CCTV Molesting MP's... విలేకరిపై దాడి చేసిన వారిపై చర్యలు తీస... Iris Global Expands Into AI-First Ecos... Madan Lal urges BCCI to keep Rishabh P... Filmibeat Publishes New Entertainment... Filmibeat Reports on 'Laagi Chhoote Na...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గోనెగండ్ల జడ్పీటీసీ ఎన్నికల బ్యాలెట్ పేపర్ల జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు

✍️ Reporter: బోయ రాజు 🗓 24 Nov 2026, 06:05 AM 👁 24
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
రీ-ఎలక్షన్ నిర్వహించాలి – జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఎస్వీ మోహన్ రెడ్డి, రాజీవ్ రెడ్డి కర్నూల్ ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు బయటపడిన ఘటనపై వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు తేలితే తక్షణమే రీ-ఎలక్షన్ నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి డిమాండ్ చేశారు సోమవారం కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి గారి కి ఈ ఘటనపై వారు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ నాయకులు కుట్ర రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు వేధింపులు నామినేషన్ దశ నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడ్డారని విమర్శించారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ ప్రక్రియలోనూ అక్రమాలు జరిగాయని, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు మాయమయ్యాయని ఆరోపించారు ముఖ్యంగా గోనెగండ్ల జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు చెత్తకుప్పలో బయటపడటం ఎన్నికల పారదర్శకతపై అనేక అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ఈ ఘటన ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాల్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల పేరుతో దౌర్జన్యాలు.. బ్యాలెట్ పేపర్లతో అక్రమాలు రాజీవ్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బ్యాలెట్ పేపర్లు బయటపడిన ఘటన ఎన్నికల నిర్వహణలో పారదర్శకతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోందని అన్నారు ఎన్నికల్లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై ఆధారాలు ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనపై అధికారులు తక్షణమే స్పందించి, పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గోనెగండ్ల జడ్పీటీసీ ఎన్నికలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, నిబంధనల ప్రకారం న్యాయం చేయాలని, అవసరమైతే రీ-ఎలక్షన్ నిర్వహించాలని కోరారు. లేనిపక్షంలో వైఎస్సార్‌సీపీ తరఫున న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిశీలకులు తెర్ణేకల్ సురేంద్ర రెడ్డి, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ గుర్రాజు రావు, జడ్పీటీసీ అభ్యర్థి జహంగీర్, జిల్లా కార్యదర్శి బందే నవాజ్, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్సూర్ తదితర నాయకులు పాల్గొన్నారు.
📲Get App