🔥 ट्रेंडिंग जम्मू-कश्मीर ने 2023 के 3.3 GW से कम प... जम्मू-कश्मीर हाई कोर्ट ने 84 न्यायिक अ... जम्मू-कश्मीर की राजनीतिक उलझन के मूल म... गोवा में अंतरराष्ट्रीय फिल्म महोत्सव:... गोवा में 22 नवंबर को CJP ने ‘क्या बोलत... कैलांगुटे में आग से चार बीच शैक जल गए,...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాల అభివృద్ధికి మరింత ఊతం కూటమి బలపరిచిన అభ్యర్థులకు భారీ మెజారిటీ అందించండి: కాకూరు శేఖర్

✍️ रिपोर्टर: Reporter Lammasingi Raju 🗓 19 नव. 2026, 09:42 PM 👁 28
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని బీజేపీ మండల అధ్యక్షుడు కాకూరు శేఖర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మండలంలోని 16 పంచాయతీలకు గాను మూడు పంచాయతీల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు. గూడెంకొత్తవీధిలో గెమ్మెల త్రినాథ్, వంచలలో చల్లంగి అచ్యుత్ రావు, ధమనపల్లిలో దుక్కెరి మహేశ్వరి ఎన్నికల బరిలో ఉన్నారని వెల్లడించారు. వీరి విజయానికి కూటమి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కోరారు.కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మారుమూల గిరిజన గ్రామాల్లో ఇళ్లు, రహదారులు, వీధిలైట్లు, పారిశుధ్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పీఎం జన్‌మన్ పథకంతో గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, దుస్తులు, బాలింతలకు పౌష్టికాహారం వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని వివరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి భారీ మెజారిటీతో గెలిపించాలని కాకూరు శేఖర్ విజ్ఞప్తి చేశారు.
📲Get App