🔥 ट्रेंडिंग बिलासपुर के आधारशिला स्कूल के कराते खि... জমি বিবাদকে কেন্দ্র করে দুই পক্ষের সংঘ... कल्याण कोर्ट और सिविल कोर्ट के 173 से... Punjab Diwali Bumper : ਡੇਰਾਬੱਸੀ ਦੇ ਕਿਸ... હિંમતનગર પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક ઉલ્લં... केसर मिल की जमीन 41.05 करोड़ में नीलाम...
17 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

పార్టీ పేరు చెప్పుకుని ఓట్లు అడగడం సరికాదు.. టీడీపీ నేతల విమర్శలు! అధికారిక మద్దతు లేకుండానే స్వీయ ప్రకటనలా? ఓటర్లు వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి

✍️ रिपोर्टर: Reporter Lammasingi Raju 🗓 17 नव. 2026, 08:37 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల మద్దతు విషయంలో కొందరు అభ్యర్థులు చేస్తున్న ప్రచారంపై టీడీపీ నాయకులు సిరిబాల బుజ్జిబాబు, మొట్టడం నూకరాజు, మొట్టడం రామకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయంతో సంబంధం లేకుండా తమకు మద్దతు ఉందంటూ ప్రచారం చేసుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలో నిలుస్తారని, రాజకీయ పార్టీలు తమ మద్దతును ప్రకటిస్తాయని వివరించారు. ఈసారి ఆశావహులు ఎక్కువగా ఉండటంతో ఒకే పార్టీ నుంచి పలువురు నామినేషన్లు దాఖలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
అయినప్పటికీ కొందరు అభ్యర్థులు తమకే పార్టీ మద్దతు ఉందని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడకముందే మద్దతు ఖరారైనట్లు చెప్పుకోవడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఇలాంటి ప్రచారాలతో ఓటర్లలో గందరగోళం సృష్టించవద్దని హితవు పలికారు.ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఇచ్చే హామీలు, చేసే ప్రచారాలను గుడ్డిగా నమ్మకుండా వారి గత ప్రవర్తన, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను పరిశీలించాలని సూచించారు. వాస్తవాలను తెలుసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని టీడీపీ నాయకులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
📲Get App