🔥 TRENDING Ankit kumar mourya तिलहर में फाइलेरिया उन्मूलन अभियान: 19... कोयल नदी के पुल पर मेदिनीनगर‑चैनपुर मा... टिकैत किसान गुट ने तिलहर एसडीएम आदित्य... खेरेश्वर महादेव मंदिर में मांस मिलने प... अनूपपुर कोतमा के अंतर्गत जर्राटोला में...
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

గూడెంకొత్తవీధి సర్పంచ్ ఎన్నికల బరిలో బీజేపీ నేత గెమ్మెల త్రినాధ్! కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ సమర్పణ.. భారీగా తరలివచ్చిన కూటమి శ్రేణులు

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 17 Nov 2026, 05:41 PM 👁 35
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
గూడెంకొత్తవీధి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారుతోంది. కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ సీనియర్ నాయకుడు గెమ్మెల త్రినాధ్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఎన్నికల కార్యాలయానికి చేరుకుని తన నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు. బీజేపీలో సుమారు 15 ఏళ్లుగా కొనసాగుతున్న త్రినాధ్, గతంలో ఐదేళ్లపాటు గూడెం మండల అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలు నిర్వహించారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ రాజకీయంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఆయనకు నూకదొర సామాజిక వర్గంతో పాటు స్థానికంగా పరిచయాలు ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేయడంతో కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గూడెంకొత్తవీధిలో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి.
📲Get App