🔥 ट्रेंडिंग पश्चिम त्रिपुरा प्रशासन ने डीजे सिस्टम... स्कूल कल (16 नवंबर) बंद – राज्यवार सूच... हिमाचल प्रदेश के किन्नौर में अनियमित म... हिमाचल प्रदेश पविलियन का उद्घाटन हुआ इ... ग्राम प्रधान द्वारा छठ पूजा का आयोजन બોટાડમાં માવાની ખરીદીમાં ખામી, દુકાનમા...
15 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

వంచుల పంచాయతీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం.. సాంబశివరావుకు నాయకుల మద్దతు

✍️ रिपोर्टर: Reporter Lammasingi Raju 🗓 15 नव. 2026, 07:15 PM 👁 30
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
వంచుల గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. వైఎస్సార్‌సీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన గమ్మెల సాంబశివరావుకు మద్దతుగా పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశమై ఎన్నికల కార్యాచరణపై చర్చించారు.ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి అవసరాలపై నాయకులు ప్రధానంగా దృష్టి సారించారు. రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, విద్య, వైద్య సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. పంచాయతీలోని అన్ని గ్రామాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందించేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.రానున్న ఎన్నికల్లో గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించే నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని నాయకులు కోరారు.ఈ సమావేశంలో బొబ్బిలి లక్ష్మణ్, వంతల అరుణ్ కుమార్, ఏ.ఎం. మజీద్, అంజి, గమ్మెల జోగిరాజు, మాజీ ఎంపీపీ బోయిన కుమారి, వనపల రాజేష్, వనపల కాసులమ్మ, అరడ సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
📲Get App