🔥 TRENDING Karnataka Congress Leaders Slam BJP Ov... PM Modi lands in Bengaluru for Namma M... I&B Minister Ashwini Vaishnaw to Inaug... Farmers protest at Jagraon market, sit... Former DEO in Rewa faces FIR over fake... Father, Son Arrested for Uploading Fak...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ప్రతి వర్షపు చుక్క భూమిలోకి.. భూగర్భ జలాల పెంపునకు మథురనగర్‌లో ప్రత్యేక కార్యాచరణ

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 13 Nov 2026, 11:45 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
నేరడిగొండ: వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకింపజేసి భూగర్భ జలాలను పెంపొందించాలనే లక్ష్యంతో నేరడిగొండ గ్రామపంచాయతీ పరిధిలోని 7వ వార్డు మథురనగర్ కాలనీలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
సామాజిక కార్యకర్త సాబ్లే సంతోష్ సింగ్, ఉపసర్పంచ్ గోతి గులాబ్ సింగ్, గ్రామపంచాయతీ కార్యదర్శి అరుణ్, కారోబారి పోశెట్టి కాలనీలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి ఇంకుడు గుంతల ప్రాధాన్యతను వివరించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు మంజూరు చేయించేలా చొరవ తీసుకున్నారు.
ఈ సందర్భంగా సాబ్లే సంతోష్ సింగ్ మాట్లాడుతూ.. భూగర్భ జలాలు రోజురోజుకూ తగ్గుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి పంపించడం వల్ల బోర్లు, బావుల్లో నీటి నిల్వలు పెరుగుతాయని తెలిపారు. ప్రతి ఇంటి యజమాని ఇంకుడు గుంత నిర్మించుకొని, శుభ్రంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.
అలాగే మురుగునీరు నిలిచే ప్రాంతాల్లో గ్రామపంచాయతీ ద్వారా కమ్యూనిటీ ఇంకుడు గుంతలు మంజూరు చేయించి పనులు ప్రారంభించాలని కోరారు.
“ప్రతి ఇంటా ఇంకుడు గుంత.. ప్రతి గ్రామంలో జలసంరక్షణ” అనే నినాదంతో ప్రజలందరూ నీటి సంరక్షణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు షాకీర్, సాప్, యూనుస్, జియాఉల్లా, నయీమ్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.
📲Get App