🔥 TRENDING Norwegian journalist barred from visit... Mahesh Bhagwat appointed as new Hydera... Odisha Unveils Unified Roadmap for Hol... Odisha Prepares for Viksit Odisha 2036... India Faces 55,000 Heat Deaths Forecas... Two Killed, Six Injured as Wrong‑Way D...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

భూపాలపల్లి ఏరియాలో బొగ్గు నాణ్యత వారోత్సవాలు ఘనంగా ప్రారంభం

✍️ Reporter: Burra Kirankumara 🗓 12 Nov 2026, 07:38 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
భూపాలపల్లి ఏరియా: 12-11-2026న సింగరేణి భూపాలపల్లి ఏరియాలో బొగ్గు నాణ్యత వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం జీఎం కార్యాలయ ఆవరణలో నడిచింది, ఇందులో ఏరియా ఇన్‌చార్జి జనరల్ మేనేజర్ శ్రీ డి. శ్యామ్ సుందర్ బొగ్గు నాణ్యత పతకాన్ని ఆవిష్కరించారు. ఆయన విద్యుత్ రంగంలో పెరుగుతున్న పోటీ నేపథ్యంలో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి, సరఫరా సంస్థకు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నదని చెప్పారు.

డీ. శ్యామ్ సుందర్ బొగ్గు వెలికితీత, సార్టింగ్, సైజింగ్, నిల్వ, లోడింగ్, డిస్పాచ్ వంటి ప్రతి దశలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని, బొగ్గులో మట్టి, బండరాళ్లు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన నాణ్యత అనేది ఒక్క విభాగ బాధ్యత కాదు, ప్రతి ఉద్యోగి సమష్టి బాధ్యతగా సంస్థ పురోబివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఓ టు జీఎం రమణ్ వీ పాఠక్, పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యామ్ సుందర్, ఏఐటిం‌యూ‌సి నాయకులు మోటపలుకుల రమేశ్, ఐఎన్‌టి‌యూ‌సి నాయకులు బి.మధుకర్ రెడ్డి, సిఎంఓఐఏ ప్రతినిధి ప్రదీప్, క్వాలిటీ ఇంచార్జ్ మేనేజర్ కుమారస్వామి, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
📲Get App