ఆదివాసీ సంప్రదాయాలకు పుట్టినిల్లు ఆదిలాబాద్ గిరిజన పల్లెలు!
తలమడుగు: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దండారి (గుస్సాడి) ఉత్సవాలు ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తలమడుగు మండలంలోని పాల్సి-K గ్రామంలో గ్రామస్థుల ఆహ్వానం మేరకు నిర్వహించిన దండారి ఉత్సవాల్లో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆదివాసీ కళాకారులతో కలిసి ఎమ్మెల్యే సంప్రదాయ దండారి నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా సందడి చేశారు. అనంతరం మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, దండారి ఉత్సవాలు వారి ఐక్యతకు, కళా వైభవానికి ప్రతీకలని పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ వాటి విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ గ్రామాల పటేళ్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.