🔥 ट्रेंडिंग नरपतगंज ब्लॉक के पास चाय की दुकान पर प... ಬಂಗಾರಪೇಟೆ ಬೂದಿಕೋಟೆ ಹೋಬಳಿ ಗುಲ್ಲಹಳ್ಳಿ ಕೊ... धनतेरस पर हरिद्वार के ज्वालापुर और रान... बिहार के मनीष कश्यप ने अनुष्का शर्मा क... अनूपपुर: प्राथमिक शिक्षक से मारपीट व ध... Kashmir support Pandit mr Nazir Ahmad...
06 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జీకే వీధిలో కౌంటింగ్‌కు పోలీసుల కఠిన నిబంధనలు కేంద్రం పరిసరాల్లో వాహనాల నిలిపివేత.. ర్యాలీలు, బాణాసంచాకు అనుమతి లేదు

✍️ रिपोर्टर: Reporter Lammasingi Raju 🗓 06 नव. 2026, 09:40 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో గూడెం కొత్తవీధి మండలంలో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రత్యేక ఆంక్షలు విధించినట్లు ఎస్సై సురేష్ తెలిపారు. జీటీడబ్ల్యూ పాఠశాల నుంచి జీ.కే.వీధి సెంటర్ వరకు సెక్షన్ 160 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ పరిధిలో ద్విచక్ర వాహనాలు, కార్లతో సహా ఎలాంటి వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. వాహనదారులు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లే మార్గంలో కేటాయించిన ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని వినియోగించుకోవాలని సూచించారు.కౌంటింగ్ ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం, బాణాసంచా కాల్చడం పూర్తిగా నిషేధమని హెచ్చరించారు. పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించకుండా రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సహకరించాలని ఎస్సై సురేష్ కోరారు.
📲Get App