అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న భీంరెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఇచ్చోడ: మండల కేంద్రానికి చెందిన గుమ్మడి భీంరెడ్డి అనారోగ్యంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఈరోజు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు