🔥 TRENDING 9 ਸਾਲ ਦੀ ਬੱਚੀ ਅਮਾਇਰਾ ਦੀ ਦੁਖਦਾਈ ਘਟਨਾ: ਸ... सड़क हादसा Lucknow Crime Branch Intensifies Probe... Akshay Kumar and Saif Ali Khan’s ‘Haiw... Arnold Schwarzenegger’s Christmas Heis... ReadersFusion Releases 2026 Christmas...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

చిన్నగ్రహారంలో టీడీపీ కూటమి ఎంపీటీసీ అభ్యర్థి ఇంటింటా ప్రచారం సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని పసుపులేటి చైతన్య విజ్ఞప్తి

✍️ Reporter: Reporter RAJU 🗓 03 Nov 2026, 08:06 AM 👁 25
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజుజిల్లా గూడెం కొత్తవీధి మండలం చిన్నగ్రహారం గ్రామంలో టీడీపీ కూటమి ఎంపీటీసీ అభ్యర్థి పసుపులేటి చైతన్య సోమవారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనకు మద్దతు తెలపాలని ఓటర్లను కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు నాగమణి, శ్రీను, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
📲Get App