🔥 TRENDING Need24 थालड़का में खाद्य सुरक्षा दल ने 8 प्रत... ਸਲਾਨਾ ਖੇਡ ਮੁਕਾਬਲਾ ਬਾਬਾ ਈਸ਼ਰ ਸਿੰਘ (ਨ)... पंचायत चुनाव संपन्न हुए ಕನ್ನಡ ರಾಜ್ಯೋತ್ಸವದ ಧ್ವಜಾರೋಹಣಕ್ಕೆ ಅಗೌರವ:... *जनजातीय गौरव दिवस के उपलक्ष में विद्य...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సెంకడలో రొబ్బ పుష్పలక్ష్మి ప్రచారం కమలం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 03 Nov 2026, 03:41 PM 👁 107
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం సెంకడ గ్రామంలో బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థి రొబ్బ పుష్పలక్ష్మి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో అభివృద్ధిని కాంక్షిస్తూ కమలం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరిమెల రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు వాస్పరి శ్రీనివాస్, యువ మోర్చా అధ్యక్షుడు దేపూరు పండు, నాయకులు సాగిన నరేంద్ర ప్రసాద్‌తో పాటు మహిళా కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నాయకులు, కార్యకర్తలు నిర్వహించిన ఇంటింటి ప్రచారంతో సెంకడ గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది.
📲Get App