రైతు గర్జన సభకు బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణులు
నేరడిగొండ: ఆదిలాబాద్‌లోని డైట్ కాలేజీ గ్రౌండ్‌లో నేడు జరగనున్న రైతు గర్జన సభకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్తున్నారు. ఈ సందర్భంగా నేరడిగొండ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసం వద్ద బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన స్వాగతం పలికి సభకు తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు.