🔥 TRENDING Rana ke pass ramniya gaon mein do bike... રાજકોટ સરાઝા હોટલમાં દારૂ પાર્ટી કાંડ:... Armed Gang Kills VCK Functionary in Tu... Tamil Nadu approves 26 new POCSO speci... BJP MP Janardan Mishra Cleans Toilet S... Madhya Pradesh Forecast: Rain and Thun...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

పోలింగ్ బూత్ల వద్ద టీడీపీ అక్రమాలపై పులివెందుల.. వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్వో కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు...

✍️ Reporter: KUMMARI THAYANNA 🗓 01 Nov 2026, 07:23 PM 👁 50
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
రాష్ట్రంలో ఓటు వేసే పరిస్థితులు లేవు
ఎస్‌ఈసీతో కలిసి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు
ఎస్‌ఈసీ.. చంద్రబాబు మనిషి
కూటమి ప్రభుత్వం దారుణాలపై వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఆందోళన..

వైఎస్సార్ కడప: పులివెందులలో ఈరోజు(ఆదివారం, నవంబర్‌ 1వ తేదీ) మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా చోటు చేసుకున్న దారుణాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకం చూస్తుంటే ఓటు వేసే పరిస్థితులు లేవన్నారు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి...

చంద్రబాబుతో కుమ్మక్కైన ఎస్‌ఈసీ ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే పులివెందులలో వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి. ఓటు వేయకుండానే వెనుదిరిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై, అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
‘నేను ఓటు వేయను.....

రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులు ప్రజలకు తెలియాలి. ఓటేస్తే అంతా సవ్యంగా ఉందనే భ్రమ కలుగుతుంది, కానీ ఇక్కడ ఓటు వేసే పరిస్థితులు ఏమాత్రం లేవు. రాష్ట్ర ఎన్నికల సంఘంతో సహా అధికారులందరూ సీఎం చంద్రబాబు చేతిలో తోలుబొమ్మలుగా మారారు.

ఇక్కడ రీపోలింగ్‌ పెడితే అప్పుడొచ్చి ఓటేస్తా.... టీడీపీ అరాచకాలపై న్యాయపోరాటం చేస్తాం, కోర్టుకు వెళతాం. ప్రజా స్వామ్యాన్ని కాపాడుకోకపోతే ఈరోజు మీ ఓటు పోతుంది.. రేపు మీ ఆస్తులే పోతాయి’అంటూ వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఓటర్లను అప్రమత్తం చేశారు.



అంతకుముందు వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో రీపోలింగ్‌ నిర్వహించేలా అధికారులు నిర్ణయం తీసుకోవాలంటూ ఆర్వో కార్యాలయం ఎదుట వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి. బైఠాయించారు. తమ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించలేదని ఆరోపించారు. అప్పటికే ఫిర్యాదు చేసేందుకు ఆర్వో కార్యాలయానికి చేరుకున్న ఏజెంట్లు కింద బైఠాయించి నిరసన తెలుపుతుండగా వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి కూడా వారితోపాటు కూర్చొని నిరసన తెలిపారు....
📲Get App