మాలిగూడలో వైఎస్సార్‌సీపీ ప్రచారం.. బొబ్బిలి లక్ష్మణ్‌కు మద్దతుగా నేతల పర్యటన ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు అభ్యర్థన
అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండలం మాలిగూడ గ్రామంలో జీకే వీధి 3వ సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థి బొబ్బిలి లక్ష్మణ్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని లక్ష్మణ్ కోరారు.గ్రామాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో మాజీ ఎంపీపీ బోయిన కుమారి, అంజి, రాజారావు, నాయుడు, కృప, బాబీ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.