🔥 TRENDING Hundreds of Women Ride Royal Enfield B... मेरठ कैंट विधानसभा क्षेत्र के राजकीय इ... एक साल से खुदी पड़ी हैं सिकंदराराऊ की... Global watch service firm SAVance open... कान्हा टाइगर रिजर्व के मुक्की क्षेत्र... Karnataka to Partner with University o...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సిరికొండలో పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 22 Oct 2026, 09:04 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సిరికొండ: పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సిరికొండ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గురువారం కాండిల్ ర్యాలీ నిర్వహించారు. దేశ ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సిరికొండ ఎస్‌ఐ భూపెల్లి విక్రమ్, పోలీస్ సిబ్బంది, సిరికొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంచం లక్ష్మణ్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి షేక్ ఇమామ్, సిరికొండ ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు తోకల రాజు, స్థానిక యువకులు పాల్గొన్నారు.
దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
📲Get App