ప్రత్యేక అలంకరణతో దర్శనమిచ్చిన ఈ చౌడేశ్వరి దేవి అమ్మవారు
కళ్యాణదుర్గం పట్టణంలో వెలసిన శ్రీ చౌడేశ్వరీ దేవి ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాద వినియోగం చేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.