🔥 TRENDING Tamil Composer Deva Dies at 75 in Chen... जलेसर-सिकंदराराऊ मार्ग पर बड़ा सड़क हा... BJP MP Lehar Singh Siroya Says Those W... Heavy Rainfall Forecast for Andhra Pra... चौथे स्तंभ पर हमला बर्दाश्त नहीं: पत्र... Eight dead, fifteen injured as vehicle...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

రైస్ మిల్లు దళారులు, ట్రాక్టర్ యజమానుల దోపిడీతో సన్నకారు రైతుల ఆవేదన

✍️ Reporter: JANGILI NAGARAJU 🗓 17 Oct 2026, 11:42 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

రైస్ మిల్లు దళారులు, ట్రాక్టర్ యజమానులు అధిక ధరలు వసూలు చేస్తూ సన్నకారు రైతులను దోపిడీ చేస్తున్నారని, ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు.

రైస్ మిల్లు దళారులు, ట్రాక్టర్ యజమానుల దోపిడీతో సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులకు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ వారిని దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్రాక్టర్లతో పొలం దున్నడానికి గంటకు 1200 నుండి 1500 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎకరం పొలంలో నాట్లు వేయడానికి 7000 రూపాయలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా, నాట్లు వేసిన తర్వాత దిగబాటు, గట్టిగా వస్తుందని అదనంగా మరో 2000 నుండి 3000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

కొత్త కొయ్యడానికి కోత మిషన్లకు గంటకు 3000 నుండి 3500 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. ప్రభుత్వం మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు చేయడం లేదని, దీంతో రైతులు దళారులకే తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు.

ఇక, కోసిన వడ్లు తీసుకెళ్లడానికి కూడా 1000 నుండి 3000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని, ఈ దోపిడీని అరికట్టి తమను ఆదుకోవాలని సన్నకారు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మీ జంగిలి నాగరాజు,
NEED24 న్యూస్,
నల్గొండ సిటీ రిపోర్టర్.
📲Get App