🔥 ट्रेंडिंग લસકાણા પોલીસે ડુપ્લીકેટ સાબુનું રેકેટ... અમરેલીના પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમ્મરન... कीरा अडवानी और सिद्धार्थ मल्होत्रा ने... भूमि पेडनेकर ने खुलासा किया 'Thank You... काली खेती की रिलीज़ तारीख 20 नवंबर 202... ट्रिपुरा कांग्रेस ने एगर्टाला में सीईस...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సిరికొండ అభివృద్ధికి ఎమ్మెల్యే భోజ్జు పటేల్ కృషి

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 07 अक्टू. 2026, 03:45 PM 👁 25
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

విద్యుత్ సమస్య పరిష్కారానికి కొండాపూర్‌లో సుమారు రూ.1.01 కోట్లతో సబ్‌స్టేషన్ మంజూరు చేయించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్లు, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్ తదితర సంక్షేమ పథకాలతో ప్రజలకు ప్రయోజనం కలుగుతోందన్నారు.

సిరికొండ, అక్టోబర్ 7: ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ సహకారంతో సిరికొండ మండలంలోని గ్రామాల్లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
19 గ్రామపంచాయతీల పరిధిలో గిరిజన గ్రామాలను అనుసంధానం చేసేందుకు సుమారు రూ.4.70 కోట్లతో కల్వర్టుల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అలాగే SDF నిధులతో అభివృద్ధి పనులు, సుమారు రూ.30 లక్షల FDR పనులు, రూ.25 లక్షల తాత్కాలిక మరమ్మతులు, ప్రతి సంవత్సరం సుమారు రూ.2 కోట్లతో CC రోడ్లు, డ్రైన్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి నిధులు సమకూరేలా కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కంచం లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు పవర్ ప్రవీణ్, జనరల్ సెక్రటరీ పెందూర్ అనిల్ కుమార్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బొడ్డు దత్తాత్రి, సర్పంచులు లక్ష్మీకాంత్, బండు పటేల్, పట్టేపు లక్ష్మణ్, చిక్రమ్ రాము, జాదవ్ దినేష్, మీరా యాదవ్ రావ్, మాజీ జడ్పీటీసీ కుంరం చంద్రకళ-రఘురామ్, మార్కెట్ డైరెక్టర్ చవాన్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
📲Get App