🔥 TRENDING ମୟୂରଭଞ୍ଜରେ ବିଜିଲାନ୍ସ ଜାଲରେ ଅରବିନ୍ଦ ମହା... બજરંગદળ, અમદાવાદ વિષય: રામોલ પોલીસ સ્ટ... Kerala Suvarna Keralam SK-45 Lottery R... Kerala Declares Rs 1 Crore Winner in S... Vi Lists Malayalam OTT Releases for Oc... Telangana Today publishes editorial pr...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

రైతులను ఆదుకోవాలని బీజేపీ డిమాండ్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 05 Oct 2026, 04:47 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సిరికొండ: సిరికొండ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని బీజేపీ మండల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మండల అధ్యక్షుడు బోయిన్‌వాడ్ అమోల్ మాట్లాడారు.
మండలంలోని పంట పొలాలను అధికారులు సర్వే చేసి, పరిస్థితులను పరిశీలించి కరువు ప్రకటన చేయాలని కలెక్టర్‌ను కోరారు. అలాగే మండలంలో విద్యుత్ కోతలపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు నిరంతర విద్యుత్ అందించాలని విజ్ఞప్తి చేశారు.
సమస్యలను పరిష్కరించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు, దీక్షలు చేపడతామని బీజేపీ నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సభ్యుడు మాణిక్‌రావు, మాజీ ఎంపీటీసీ బాలాజీ, బూత్ అధ్యక్షులు పెంట గంగాధర్, రాములు, శివశంకర్, అప్పా తదితరులు పాల్గొన్నారు.
📲Get App