🔥 TRENDING નવા ભાડા અધિનિયમનો વિરોધ: વડોદરા સહિત... માતાપિતા વચ્ચે સૂતેલો બાળક દીપડો ઉપાડી... बघौली-प्रतापनगर संपर्क मार्ग पर एक साल... देवीपुरा गांव पोस्ट मंडोरा आंवला बरेली... गोविंदपुर में सघन वाहन जांच अभियान, बा... પોલીસકર્મીને નેમ પ્લેટ અંગે પૂછતાં માર...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఇందిరమ్మ ఇండ్లు నివాసానికా? లేక లాడ్జిలకా?

✍️ Reporter: Mudda Pitchaiah 🗓 04 Oct 2026, 01:04 PM 👁 21
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్లు పేదలకా? పెద్దలకా?*

*లాడ్జీలుగా మారుతున్న ఇందిరమ్మ ఇళ్లు - అధికారులు ఏం చేస్తున్నారు?*

*భద్రాచలం, అక్టోబర్ 3:* పేదలకు నివాసం ఉండటానికి ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లు భద్రాచలంలో వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

భద్రాచలం పట్టణంలోని *శిల్పి నగర్* లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇద్దరు తమకు కేటాయించిన ఇళ్లను నివాస గృహాలుగా కాకుండా లాడ్జీలుగా నిర్మిస్తున్నారని స్థానికుల నుండి ఆరోపణలు వస్తున్నాయి. పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చడానికి ఇచ్చిన ఇళ్లను ఇలా లాడ్జీలుగా మార్చి వ్యాపారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఈ వ్యవహారం అధికారులకు తెలిసే జరుగుతుందా? తెలియకుండా జరుగుతుందా? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా లాడ్జీల నిర్మాణం జరుగుతున్నా అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా ఇలా వ్యాపార అవసరాల కోసం కట్టే భవనాలకు అధికారులు ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను ఎలా మంజూరు చేస్తున్నారు? అసలు బిల్లులు ఇచ్చే ముందు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారా? లేదా అనేది కూడా అనుమానంగా మారింది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు కేవలం లబ్ధిదారుడు నివాసం ఉండటానికి మాత్రమే. వాటిని అద్దెకు ఇవ్వడం, వ్యాపార సంస్థలుగా మార్చడం నిబంధనలకు విరుద్ధం. అలాంటి వారిపై చర్యలు తీసుకుని ఇళ్లను రద్దు చేయాలి.

కాబట్టి జిల్లా కలెక్టర్ గారు, RDO గారు, పంచాయతీ సెక్రటరీ గారు వెంటనే స్పందించి శిల్పి నగర్ లో జరుగుతున్న లాడ్జీల నిర్మాణంపై విచారణ జరిపి, నిజమైన పేదలకు న్యాయం చేయాలని కోరుతున్నాము.
📲Get App