మహారాష్ట్ర రైతులకు రెండు జిన్నింగ్ మిల్లులు: కలెక్టర్
మహారాష్ట్రలోని మహోర్, కిన్వట్ ప్రాంతాల నుంచి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చే రైతుల పత్తి కొనుగోలుకు ప్రత్యేకంగా రెండు జిన్నింగ్ మిల్లులు కేటాయిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. స్థానిక, మహారాష్ట్ర రైతుల మధ్య వివాదాలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మార్కెట్యార్డు రహదారి మరమ్మతులు జరుగుతున్నందున రైతులు రాంపూర్ మీదుగా మార్కెట్కు రావాలని సూచించారు.