ఆదిలాబాద్: రిమ్స్ పారిశుద్ధ్యం అంతంతే పాన్ గుట్కా తిని గోడలకు ఉమ్మ వేస్తున్న జనాలు
రిమ్స్ ఆసుపత్రిలో పారిశుద్ధ్య పరిస్థితులపై రోగులు, బంధువులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఇటీవల ఆసుపత్రిని సందర్శించి సమీక్ష చేసినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదని పేర్కొంటున్నారు. ప్రతిరోజూ వేలాది మంది రోగులు వచ్చే ప్రాంతంలో పరిశుభ్రత లోపించడం ఇబ్బందికరంగా మారిందన్నారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.