ముఖరా (కే)లో ఫారం ఫండ్ పనులు ప్రారంభం
ఇచ్చోడ మండలం ముఖరా(కే) గ్రామంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫారం ఫండ్ పనులను సర్పంచ్ గాయక్వాడ్ జైపాల్ ముగ్గు వేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పంట కుంటల వల్ల భూగర్భ జలాలు పెరిగి, బోరుబావుల్లో నీటిమట్టం మెరుగుపడుతుందన్నారు. రైతులు కుంటలను చేపల పెంపకానికి కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు.