ఇచ్చోడ: 'ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు'
ఇచ్చోడ మండలం దేవులనాయక్ తాండలో వినాయక నిమజ్జన సందడిగా నిర్వహించారు. వినాయక చవితిని పురస్కరించుకొని గ్రామంలో నిర్వాహకులు వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి 13 రోజుల పాటు పూజలు నిర్వహించారు. శనివారం సాయంత్రం గణనాథుడికి యతుది పూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలలో ఉంచి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు లంబాడి పాఠాలతో నృత్యాలు చేశారు.